
ఎనిమిదివందల ఏళ్ల క్రితమే సమానత్వం, కాయకష్ట గౌరవం, కులవర్గ రహిత జీవనం గురించి ఘోషించిన బసవన్న వచనాల నుండి ఎంపిక చేసిన 300 వచనాల అనువాదం – బసవన్న ఆలోచనల సారాన్ని చేరువ చేసే పరిచయ వ్యాసంతో కలిసి.

ఉపనిషత్తులు, బుద్ధసంభాషణలు, భగవద్గీతలతో సమాన ప్రతిపత్తి గల అవధూతగీత, జాతికుల భేదాలను తిరస్కరించి సంపూర్ణ విముక్తి సందేశాన్ని అందించే అరుదైన కృతి. దత్తాత్రేయుల మధువిద్యపై విపుల పరిచయంతో పాటు, సులభశైలి తెలుగు అనువాదం మరియు సంస్కృత మూలం ఇందులో పొందుపరిచారు.

రచయిత అందరికీ తెలిసిన మంచి పేరున్న కవి, విమర్శకుడు, అనువాదకుడు, చిత్రకారుడు, నిత్యాన్వేషి, దార్శనికుడు`మనసులో మాటలో భాగం ఆయన పట్ల నాకున్న అభిమానం, ఆవేదన కూడా. ఇంత ప్రత్యేకత ఉన్న వ్యక్తి మలెనాడులో పుడితే కువెంపు సరసన జ్ఞానపీఠ అవార్డుతో నిలబడేవారు అనిపించింది – కల్యాణి నీలారంభం
ఈ కథ చెప్పడానికి చినవీరభద్రుడు ఒక బొటానిస్టు అయ్యారు, ఒక జియాలజిస్టు, ఒక ఇండాలజిస్టు, ఒక యాంత్రొపాలజిస్టు, ఒక పాలియాంటాలజిస్టు, ఒక సాహసి, ఒక అన్వేషకుడు, ఒక పరిశోధక విద్యార్ధి, ఒక వైల్డ్‌యువకుడూ, ఒక ప్రొఫెసరూ, ఒక దేశం నుంచి విడిపడ్డ బిడ్డా, ఒక కవీ, ఒక కథకుడూ అన్నిటినీ మించి ఒక మహాస్వాప్నికుడు అయ్యారు – సునీత రత్నాకరం

సోక్రటీసు నుండి ఉపనిషత్తుల వరకూ, బుద్ధుడి నుండి సూఫీ సంతుల వరకు – సత్యాన్వేషుల నిరంతర ప్రయాణాన్ని ఆవిష్కరించే నలభై తాత్త్విక వ్యాసాల సంపుటి ఇది. తలపు, మాట, చర్యల సమన్వయంతో జీవించాలనుకునే పాఠకులకు వాడ్రేవు చినవీరభద్రుడు అందిస్తున్న విలువైన తెలుగు తాత్త్విక గ్రంథం.